శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 06, 2020 , 19:02:06

సంగీతాభిమానులకు స్పాటిఫై ఉచిత సేవలు

సంగీతాభిమానులకు స్పాటిఫై ఉచిత సేవలు

 ముంబై : గ్రామ్‌ఫోన్‌ రికార్డుల కాలంలో రికార్డులను కొని, ఆ సంగీత మధురిమలకు మైమరిచిపోయేవారు కానీ ఇంటర్నెట్‌ యుగంలో అన్నీ ఉచితంగానే లభించాలని కోరుకుంటున్నారు. లేదంటే పైరసీకి జై కొడుతున్నారు. ఎంతగా ఈ పైరసీకి అడ్డుకట్టవేయడానికి సంస్థలు ప్రయత్నించినప్పటికీ దానికి అడ్డుకట్టవేయలేకపోవడం మ్యూజిక్‌ కంపెనీలకు శాపంగా మారింది కానీ అక్కడే తమకు అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాయి యాప్‌ కంపెనీలు. పూర్తి ఉచితంగా కోరుకున్న సంగీతం అందించడం మాత్రమే ప్రకటనల రహిత కంటెంట్‌ కోసం నామమాత్రపు ఫీజులను వసూలు చేస్తూ సంగీతాభిమానుల మనసులనూ దోచుకుంటున్నాయి. ఒక్క భాషకు మాత్రమే పరిమితం కాకుండా అంతర్జాతీయంగా విభిన్న ప్రాంతాల సంగీతాన్నీ అందిస్తున్నాయి. అలాంటి యాప్‌లలో ఒకటి స్పాటిఫై. భారతదేశంలో ప్రవేశించిన సంవత్సరకాలంలోనే సంగీతాభిమానుల మనసు దోచుకున్న ఈ యాప్‌ కు దక్షిణ భారతదేశం నుంచి మరీముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో శ్రోతలు ఉండటం విశేషం.

పైరసీయే ప్రమాదం... ఉచితమే సమాధానం...

సంగీతాన్ని ఆస్వాదించాలంటే గతంలో గ్రామ్‌ఫోన్‌, ఆ తరువాత టేప్‌ రికార్డర్‌, సీడీలు, పెన్‌ డ్రైవ్‌లు కొనాల్సి వచ్చేది. దీనితో పైరసీ వైపు ఎక్కువ మంది మళ్లేవారు. ఇప్పటికీ సంగీత ప్రపంచానికి అదే పెనుసవాల్‌గా నిలుస్తుంది. ఈ అలవాటును మాన్పించడానికి సంగీత పరిశ్రమతో పాటుగా యాప్‌లు కూడా కష్టపడుతున్నాయి.  తాము ఈ పైరసీ అలవాటు మాన్పించడం కోసమే స్పాటిఫైను ఉచితంగా అందిస్తున్నామని స్పాటిఫై ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ అమర్‌ జిత్‌ బాత్రా తెలిపారు. చేతిలో మొబైల్‌, చెవిలో వైఫై బుల్లెట్స్‌ ఉంటే చాలు... స్పాటిఫైను డౌన్‌లోడ్‌ చేసుకుని ఆస్వాదించవచ్చు. ప్రతి రోజూ తాము 40వేలకు పైగా పాటలను యాప్‌పై జోడిస్తున్నాం. వీటిని చట్టబద్ధంగా వినవచ్చు. మిగిలిన వారికి భిన్నంగా తమను నిలిపిన వినూత్న అంశం విభిన్న భాషలలో రెడీమేడ్‌ మ్యూజిక్‌ ప్లేలిస్ట్స్‌ అందించడమని స్పాటిఫై ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ అమర్‌జిత్‌ బాత్రా పేర్కొన్నారు.

తాము శ్రోతల కోసం నాలుగు బిలియన్‌లకు పైగా ప్లేలిస్ట్‌లను విభిన్న భాషలు, భావోద్వేగాల పరంగా  తీర్చిదిద్దామని, ప్రతి రోజూ తమ ప్లాట్‌ఫామ్‌పై 40వేలకు పైగా పాటలను కొత్తగా జోడిస్తున్నామని వెల్లడించారు. తెలుగు భాష వరకూ వస్తే ప్రతి రోజూ 120 ప్లేలిస్ట్స్‌ను తాము జోడిస్తున్నామన్నారు. ఉచితంగా లక్షలాది గీతాలను అందించడంతో పాటుగా ఒక రోజు మొదలుకుని వార్షిక ప్లాన్స్‌ వరకూ కూడా ప్రత్యేకంగా అందిస్తున్నారు. ఒక రోజుకు  రూ.13తో ప్రారంభమై సంవత్సరానికి రూ.1189ల వరకూ ఈ ప్లాన్స్‌ ఉన్నాయి. వీటితో పాటుగా ప్రీమియం ఫ్యామిలీ ప్లాన్‌ 179 రూపాయలు, స్టూడెంట్‌ ప్లాన్‌ నెలకు  రూ .59లకు సైతం అందిస్తున్నారు. 

ఆకట్టుకునేలా ఉంటేనే...

సంగీతాన్ని ఆస్వాదించడానికి భాషాబేధాలేవీ ఉండవు. భాష ఏదైనా భావుకత ముఖ్యమంటున్న రసజ్ఞుతల కోసం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విభిన్న ప్రాంతాల సంగీతాన్ని సంగీత ప్రేమికులకు దగ్గర చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాలలో జానపదం మొదలు సినీ సంగీతం వరకూ ప్రతి ఒక్కటీ ఆస్వాదిస్తారని స్పాటిఫై ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ అమర్‌జిత్‌ బాత్రా చెబుతున్నారు.  తాము తమిళం, తెలుగు, హిందీ లాంటి భాషల సంగీతాన్ని మాత్రమే కాకుండా విభిన్న దేశాల సంగీతాన్నీ అందుబాటులోకి తీసుకువచ్చామని ఆయన అన్నారు. తెలుగు శ్రోతల అభిరుచులను గురించి చెబుతూ ఇక్కడి వారు  పొడ్‌కాస్ట్‌లనూ వినడానికి ఆసక్తి చూపుతుండటం విశేషం. పూరీజగన్నాధ్‌ పొడ్ కాస్ట్‌తో పాటు, పాయింట్‌ ఏంటంటే, నేడే వినండి, ద టాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ వంటి వాటిని ఎక్కువగా వింటున్నారు.

అలాగే తెలుగు సినీ సంగీతానికి ఇక్కడ ఆదరణ ఎక్కువ ఉంటుంది. పాట బాగుంటే హీరోలతో కూడా ఇక్కడి వారికి సంబంధం పెద్దగా ఉండదు. దీనికి అలవైకుంఠపురంలో బుట్టబొమ్మ పాట బ్లాక్‌బస్టర్‌ అయితే నీలి నీలి ఆకాశం అంటూ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రంలోని పాట కూడా అంతే ఆదరణ పొందడమే నిదర్శనం. సాహిత్యం బాగుండాలి, సంగీతం ఆకట్టుకోవాలి. చాలు... ఆస్వాదించడానికి తెలుగు శ్రోతలు ఎప్పుడూ ముందుంటారన్నారు.

దేశీయ భాషలతో పాటుగా అంతర్జాతీయ సంగీతం, పోడ్‌కాస్ట్‌ కంటెంట్‌ను స్పాటిఫై పై అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళం, పంజాబీ, హిందీ, ఇంగ్లీష్‌తో పాటుగా పలు భాషలలో 60 మిలియన్‌లకు పైగా పాటలు, 1.5 మిలియన్‌ పొడ్‌కాస్ట్‌లు స్పాటిఫైపై అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటుగా ప్రతి రోజూ 500కు పైగా ప్లే లిస్ట్‌ జాబితాను తమ అంతర్గత సంగీత నిపుణులు ఆధునీకరించడం ద్వారా సంగీతాభిమానులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని  స్పాటిఫై ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ అమర్‌జిత్‌ బాత్రా పేర్కొన్నారు. జీరో ఎఫ్‌ఐఆర్‌ నిరాకరిస్తే పోలీసులపై క్రిమినల్‌ కేసు...