శనివారం 23 జనవరి 2021
National - Dec 01, 2020 , 16:53:38

ఆ చ‌ట్టాలు ర‌ద్దు చేయ‌క‌పోతే అవార్డులు తిరిగి ఇచ్చేస్తాం!

ఆ చ‌ట్టాలు ర‌ద్దు చేయ‌క‌పోతే అవార్డులు తిరిగి ఇచ్చేస్తాం!

జ‌లంధ‌ర్‌:  కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ నిర‌స‌న తెలుపుతున్న రైతుల‌కు న్యాయం చేయ‌క‌పోతే త‌మ అవార్డులు, మెడ‌ల్స్ తిరిగి ఇచ్చేమ‌ని పంజాబ్‌కు చెందిన కొంద‌రు క్రీడాకారులు, కోచ్‌లు హెచ్చ‌రించారు. ఆ చట్టాల‌ను వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. రైతుల‌కు మ‌ద్దతుగా వ‌చ్చిన వాళ్ల‌లో ప‌ద్మ‌శ్రీ అవార్డు గెలుచుకున్న రెజ్ల‌ర్ క‌ర్తార్ సింగ్‌, ఒలింపిక్ గోల్డ్ మెడ‌లిస్ట్ హాకీ ప్లేయ‌ర్, అర్జున అవార్డీ గుర్మ‌యిల్ సింగ్‌, ఒలింపిక్ హాకీ ప్లేయ‌ర్‌, అర్జున అవార్డీ స‌జ్జ‌న్ చీమా, ఇండియ‌న్ హాకీ టీమ్ మాజీ కెప్టెన్ రాజ్‌బీర్ కౌర్ ఉన్నారు. జలంధ‌ర్ ప్రెస్‌క్ల‌బ్‌లో వీళ్లు మంగ‌ళ‌వారం ప్రెస్ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాలు రైతుల‌కు మేలు చేయ‌వ‌ని వాళ్లు అభిప్రాయ‌ప‌డ్డారు. పంజాబ్‌లో క‌నీసం 150 మంది అర్జున అవార్డులు, ప‌ద్మ అవార్డులు అందుకున్న వాళ్లు ఉన్నార‌ని.. వాళ్లంతా త‌మ అవార్డుల‌ను వెన‌క్కి ఇచ్చేస్తార‌ని వాళ్లు హెచ్చ‌రించారు. వారం రోజులుగా పంజాబ్ రైతులు దేశ రాజ‌ధానిలో నిర‌స‌న‌లు తెలుపుతున్న సంగ‌తి తెలిసిందే. 


logo