'ఫిట్ ఇండియా స్కూల్ వీక్'ను ఆవిష్కరించిన కేంద్రమంత్రి

ఢిల్లీ: "ఫిట్ ఇండియా స్కూల్ వీక్ "రెండో ఎడిషన్ ను కేంద్ర క్రీడాశాఖామంత్రి కిరణ్ రిజిజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం వర్చువల్ విధానంలో జరిగింది. పిల్లల్లో శారీరక వ్యాయామం పట్ల, క్రీడల పట్ల ఆసక్తి పెంచి, ప్రోత్సహించటం, అలవాటు చేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశ్యం. బాల్యంలోనే పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించటం మంచిదనే ఉద్దేశంతో ఫిట్ ఇండియాను పాఠశాలలకు పరిచయం చేస్తున్నారు. "పాఠశాల స్థాయిలోనే ఫిట్ నెస్ కు ప్రాధాన్యం ఇవ్వాలసిన అవసరాన్నిక్రీడాశాఖామంత్రి కిరణ్ రిజిజు నొక్కి చెప్పారు.
దేశం ఫిట్ గా ఉండాలంటే విద్యార్థులే దానికి చోదక శక్తి అన్నారు. పెద్ద సంఖ్యలో పాఠశాలలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవటానికి ఆసక్తి చూపటం, వారం వారం ఈ సంఖ్య పెరగటం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. ప్రతి భారతీయుడు ఫిట్ గా ఉండాలన్న లక్ష్య సాధనకు కావాల్సిన శక్తి పాఠశాలల్లోనే తయారవుతోందన్నారు కిరణ్ రిజిజు. గతేడాదిలో మొదలైన ఫిట్ ఇండియా స్కూల్ వీక్ ప్రచారోద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా15,000 పాఠశాలలు పాల్గొన్నాయి. ప్రస్తుత కరోనా నేపథ్యంలోఈ కార్యక్రమాన్ని ఆన్ లైన్ లో నిర్వహిస్తున్నారు. ప్రతిపాదించిన కార్యక్రమాలను ఆయా పాఠశాలలు వర్చువల్ పద్ధతిలోనే నిర్వహిస్తాయి.
ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి పాఠశాలలు తమంతట తాముగా https://fitindia.gov.in/fit-india-school-week/ లో రిజిస్టర్ చేసుకోవాలి. ఫిట్ ఇండియా స్కూల్ వీక్ జరుపుకోవటానికి 2020 డిసెంబర్ లో ఏదైనా ఒక వారాన్ని కూడా వారే ఎంచుకోవాలి. రిజిస్ట్రేషన్ సమయంలో వారికిచ్చే జాబితా నుంచి ఏదైనా అంశాన్నిఎంచుకోవచ్చు. ఈ ఏడాది తలపెట్టిన కొన్ని అంశాల్లో ఏరోబిక్స్, పెయింటింగ్, క్విజ్,డిబేట్, డాన్స్, స్టెప్ అప్ చాలెంజ్ లాంటివి ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- వెడ్డింగ్ ఫొటోలు షేర్ చేసిన కాజల్
- సహారా ఎడారిలో ఈ వింత చూశారా?
- బూర్గుల మృతి పట్ల వినోద్ కుమార్ సంతాపం
- గూగుల్ కష్టమర్లకు గుడ్ న్యూస్..!
- బర్డ్ ఫ్లూ నిజంగా ప్రమాదమేనా...?
- ఇక సుంకాల మోతే: స్మార్ట్ఫోన్లు యమ కాస్ట్లీ?!
- లైట్..కెమెరా..యాక్షన్..'ఖిలాడి' సెట్స్ లో రవితేజ
- ఊపిరితిత్తుల ఆరోగ్యానికి 7 చిట్కాలు
- పల్లెల సమగ్రాభివృద్ధి ప్రభుత్వ ఎజెండా
- ముందస్తు బెయిల్ కోసం భార్గవ్‌రామ్ పిటిషన్