శనివారం 30 మే 2020
National - May 16, 2020 , 09:50:05

భారత్‌లో 24 గంటల్లో 103 మంది మృతి

భారత్‌లో 24 గంటల్లో 103 మంది మృతి

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 103 మంది ప్రాణాలు కోల్పోగా, కొత్తగా 3,970 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 85,940కి చేరింది. ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 2,752 కాగా, ఈ వైరస్‌ నుంచి 30,153 కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 

మహారాష్ట్రలో అత్యధికంగా 27,524 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, తమిళనాడులో 9,674, గుజరాత్‌లో 9,591, ఢిల్లీలో 8,470, రాజస్థాన్‌లో 4,534 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో 1,019 మంది, గుజరాత్‌లో 586, ఢిల్లీలో 115, రాజస్థాన్‌లో 125, తమిళనాడులో 66 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.


logo