సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 09:45:32

కొత్తగా 37,724 పాజిటివ్‌ కేసులు.. 648 మంది మృతి

కొత్తగా 37,724 పాజిటివ్‌ కేసులు.. 648 మంది మృతి

న్యూఢిల్లీ : దేశం నలుమూలాల విస్తరించిన కరోనా వైరస్‌.. ప్రజలందరినీ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. 

గడిచిన 24 గంటల్లో కొత్తగా 37,724 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 648 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 11,92,915 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 4,11,133 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ మహమ్మారి నుంచి 7,53,050 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 28,732 మరణాలు సంభవించాయి. 

మహారాష్ట్రలో అత్యధికంగా 3,27,031 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 12,276 మంది చనిపోయారు. రెండో స్థానంలో ఉన్న తమిళనాడులో 1,80,643 మందికి కరోనా సోకింది. ఢిల్లీలో 1,25,096 కేసులు, కర్ణాటకలో 71,069, ఆంధ్రప్రదేశ్‌లో 58,668, యూపీలో 53,288 గుజరాత్‌లో 50,465, తెలంగాణలో 47,704 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.


logo