బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 09:31:33

దేశంలో త‌గ్గ‌ని కరోనా ఉధృతి.. కొత్తగా 37 వేల కేసులు

దేశంలో త‌గ్గ‌ని కరోనా ఉధృతి.. కొత్తగా 37 వేల కేసులు

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 37,148 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 587 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 11,55,191 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 4,02,529 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ మహమ్మారి నుంచి 7,24,578 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 28,084 మరణాలు సంభవించాయి. 

మహారాష్ట్రలో అత్యధికంగా 3,18,695 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 12,030 మంది చనిపోయారు. రెండో స్థానంలో ఉన్న తమిళనాడులో 1,75,678 మందికి కరోనా సోకింది. ఢిల్లీలో 1,23,747 కేసులు, కర్ణాటకలో 67,420, ఆంధ్రప్రదేశ్‌లో 53,724, యూపీలో 51,160 గుజరాత్‌లో 49,439, తెలంగాణలో 46,724 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.


logo