శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 18:48:29

అమెస్ట‌ర్‌డామ్ నుంచి స్పైస్‌జెట్‌లో స్వ‌దేశానికి 269 మంది భార‌తీయులు

అమెస్ట‌ర్‌డామ్ నుంచి స్పైస్‌జెట్‌లో స్వ‌దేశానికి 269 మంది భార‌తీయులు

హైద‌రాబాద్ : వ‌ందే భార‌త్ మిష‌న్‌లో భాగంగా విదేశాల్లో ఉన్న భార‌తీయుల‌ను స్వ‌దేశానికి తీసుకువ‌చ్చేందుకు స్పైస్ జెట్ విమాన‌యాన సంస్థ త‌న సుదూర చార్టెర్ విమానాన్ని తొలిసారిగా న‌డిపింది. అమెస్ట‌ర్‌డామ్ నుంచి 269 మంది భార‌తీయుల‌ను స్పైస్‌జెట్ నేడు భార‌త్‌కు తీసుకువ‌చ్చింది. మొద‌ట బెంగ‌ళూరుకు అక్క‌డినుంచి మిగిలిన ప్ర‌యాణికుల‌ను హైద‌రాబాద్‌కు తీసుకువ‌చ్చింది. A330- 900 నియో ఎయిర్‌క్రాఫ్ట్ ప్ర‌యాణికుల‌తో ఉదయం 8.58 గంటలకు బెంగళూరు చేరుకుంది. స్పైస్ జెట్ చైర్మన్ అండ్‌ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ మాట్లాడుతూ... 

సుదూర‌ ప్రాంతం నుంచి తోటీ భార‌తీయుల‌ను స్వ‌దేశానికి తీసుకురావ‌డం స్పైస్ జెట్‌కు చారిత్ర‌క క్ష‌ణ‌మ‌న్నారు. ఈ చ‌ర్య త‌మ‌కెంతో గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు. ప్రతి కష్ట సమయాల్లోనూ మళ్ళీ మళ్ళీ అవకాశం ఉందని తామెప్పుడు న‌మ్ముతామ‌న్నారు. సంక్షోభాన్ని అవ‌కాశంగా మ‌ల‌చుకునేలా ఈ గ్లోబ‌ల్ మ‌హ‌మ్మారి బోధించింద‌న్నారు. త‌మ‌ నిజమైన సామర్థ్యాన్ని చూపించడానికి అవకాశం ఇచ్చిందన్నారు. దేశంలో అతిపెద్ద కార్గో కంపెనీగా నిలిచామ‌న్నారు. వివిధ దేశాల నుంచి 75 వేల మంది పౌరుల‌ను 450 కి పైగా చార్ట‌ర్ విమానాల్లో స్వ‌దేశానికి తీసుకువ‌చ్చిన‌ట్లు తెలిపారు.


logo