మంగళవారం 26 మే 2020
National - May 07, 2020 , 16:05:26

గ్యాస్ లీక్‌.. విశాఖ‌కు ప్ర‌త్యేక‌ సీబీఆర్ఎన్ బృందం

గ్యాస్ లీక్‌.. విశాఖ‌కు ప్ర‌త్యేక‌ సీబీఆర్ఎన్ బృందం

హైద‌రాబాద్‌: విశాఖ‌ప‌ట్ట‌ణంలోని హిందుస్థాన్ పాలిమ‌ర్స్ ప్లాంట్‌లో ఇవాళ స్టెరిన్ గ్యాస్ లీక్ కావ‌డం వ‌ల్ల సుమారు ప‌ది మంది మృతిచెందారు. కొన్ని వంద‌ల మంది అస్వ‌స్థుల‌య్యారు. ప్లాంట్ చుట్టుప‌క్క‌ల సుమారు అయిదు కిలోమీట‌ర్ల విస్తీర్ణం వ‌ర‌కు స్టెరిన్ గ్యాస్ వ్యాపించింది.  దీంతో కేంద్ర ప్ర‌భుత్వం వైజాగ్‌కు సీబీఆర్ఎన్ బృందాన్ని ర‌పిస్తున్న‌ది.  కెమిక‌ల్‌, బ‌యోలాజిక‌ల్‌, రేడియోలాజిక‌ల్‌, న్యూక్లియ‌ర్ మెటీరియ‌ల్స్‌(సీబీఆర్ఎన్‌)కు చెందిన ప్ర‌త్యేక బృందాన్ని పుణె నుంచి వైజాగ్‌కు తీసుకువ‌స్తున్నారు.  ప్ర‌మాదం జ‌రిగిన ప్లాంట్ సైట్‌కు ఆ బృందం వెళ్ల‌నున్న‌ట్లు ఎన్‌డీఎంఏ పేర్కొన్న‌ది. వైద్య కోణంలోనూ ప్ర‌త్యేక సాంకేతిక ద‌ళాన్ని ప్లాంట్ వ‌ద్ద‌కు పంపిస్తున్న‌ట్లు తెలిపారు. క‌మాండెంట్ అనుప‌మ్ శ్రీవాత్స‌వ నేతృత్వంలోని న‌లుగురు స‌భ్యుల‌ సీబీఆర్ఎన్ బృందం పుణె నుంచి వైజాగ్‌కు వెళ్తున్న‌ది.  ప్ర‌స్తుతం అక్క‌డ ప‌రిస్థితి అదుపులో ఉన్న‌ట్లు ప్లాంట్ అధికారులు చెప్పారు. లీకేజీని పూర్తిని ఆపేంత వ‌ర‌కు అక్క‌డే ఉండ‌నున్న‌ట్లు ఎన్‌డీఆర్ఎఫ్ అధికారులు చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్లాంట్ ప్రాంతం నుంచి సుమారు 500 మంది త‌ర‌లించారు.  ఘ‌ట‌న జ‌రిగిన అర‌గంట‌లోనే  ప్రాంతీయ‌ ఎన్‌డీఆర్ఎఫ్ ద‌ళాలు ఆ ప్ర‌దేశానికి వ‌చ్చిన‌ట్లు తెలిపారు.  


logo