బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Feb 23, 2020 , 23:35:24

కరోనా వైరస్‌ అంతరించాలని బౌద్ధ సన్యాసుల ప్రత్యేక ప్రార్థనలు

కరోనా వైరస్‌ అంతరించాలని బౌద్ధ సన్యాసుల ప్రత్యేక ప్రార్థనలు

బిహార్‌: చైనాను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌(కొవిద్‌-19) తక్షణమే అంతరించి పోవాలని బౌద్ధ సన్యాసులు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. బిహార్‌లోని బుద్ధ్‌ గయా వద్ద బౌద్ధ సన్యాసులంతా భారీగా చేరి, కరోనా వైరస్‌ను తుద ముట్టించాలని వారి ఆరాధ్యదైవం.. బుద్ధుడిని వేడుకున్నారు. ప్రే ఫర్‌ వుహాన్‌, టిబెట్, ఆస్ట్రేలియా తదితర దేశాల పేర్ల బ్యానర్‌ ఉంచి, సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ప్రహారీ గోడపై అన్ని దేశాల జాతీయ పతాకాలు ఉంచి ప్రార్థనలు చేశారు. కాగా, చైనా ఈ వైరస్‌ బారిన పడి ఇప్పటికీ 2 వేలకు పైగా చైనీయులు మృతి చెందారు. ఇంకా ఈ వ్యాధి లక్షణాలు ఉన్నవారు 50 వేలకు పైగా ఉన్నారు. వారిని చైనా ప్రభుత్వం ప్రత్యేక ఆస్పత్రిలో, వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, నివారణ చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా చైనాలోని వుహాన్‌ నగరంలోనే ఎక్కువ మంది ప్రజలు మృత్యువాత పడగా, దేశమంతా దీని ప్రభావం ఉందని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ అన్నారు. ఇది చైనాకు అత్యంత హెల్త్‌ ఎమర్జెన్సీ సమయమని తెలిపారు. చైనాలోనే కాకుండా ఈ వ్యాధి చాలా దేశాలకు విస్తరించింది. అన్ని దేశాల ప్రభుత్వాలు వ్యాధి లక్షణాలు ఉన్న తమ దేశ పౌరులను ప్రత్యేక శిబిరాల్లో ఉంచి, వైద్యం అందిస్తున్న విషయం తెలిసిందే.


logo