మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 03, 2020 , 15:42:29

సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషల్ పోస్టల్ కవర్ విడుదల

సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషల్  పోస్టల్ కవర్ విడుదల

ఢిల్లీ : కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ (డీ .ఎస్.టీ.) స్వర్ణోత్సవాల సందర్భంగా తపాలా శాఖ రూపొందించిన స్పెషల్ కవర్ ను ఆవిష్కరించారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, భూగోళ శాస్త్రాల అధ్యయన శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్,.. తపాలా, విద్యా, ఎలక్ట్రానిక్స్, ఐ.టి. శాఖ సహాయమంత్రి సంజయ్ ధోత్రే  స్పెషల్ కవర్ ను లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖకు డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ “విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి అంతర్జాతీయంగా అన్ని స్థాయిల్లోనూ మన శాస్త్రవేత్తలు తమ ప్రతిభాపాటవాలను రుజువు చేసుకున్నారు. కృత్రిమ మేధస్సు, నానో టెక్నాలజీ, డాటా అనాలిసిస్, ఖగోళ భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం, అటామిక్ క్లాక్ తో పాటు మరెన్నో రంగాల్లో మన శాస్త్రవేత్తలు తమ ప్రతిభను నిరూపించుకున్నారు.” అని అన్నారు.

పలు విజ్ఞాన శాస్త్ర రంగాల్లో మన దేశం 80కిపైగా దేశాలతో అంతర్జాతీయ సహకార సంబంధాలను కుదుర్చుకుందన్నారు.  సైన్స్, టెక్నాలజీ శాఖ మంత్రిగా తాను గత ఆరేళ్లుగా దేశంలోని ప్రతి పరిశోధనా కేంద్రాన్ని సందర్శించానని,  ప్రస్తుత కోవిడ్ సంక్షోభంతో సహా అనేక ప్రతికూల పరిస్థితుల్లో కూడా,.. కొత్త ప్రమాణాలు నెలకొల్పేందుకు మన శాస్త్రవేత్తలు నిర్విరామంగా పనిచేస్తూ ఉండటం, ఇది ఎంతో గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.