బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 02, 2020 , 20:54:03

ఒడిశాలో నక్సల్స్‌ క్యాంపును ఛేదించిన ప్రత్యేక ఆపరేషన్‌ బృందాలు

ఒడిశాలో నక్సల్స్‌ క్యాంపును ఛేదించిన ప్రత్యేక ఆపరేషన్‌ బృందాలు

కందమళ్‌ :  ఒడిశా రాష్ట్రంలోని కందమళ్‌ జిల్లాలోని లడపదర్‌ రిజర్వ్‌ ఫారెస్టు ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్‌ పోలీసులు బృందాలు నక్సల్స్‌ క్యాంపును ఛేదించారు. ఇక్కడ  నక్సల్స్‌ నిల్వ ఉంచిన 15కేజీల పేలుడు పదార్థాలను, 28డిటోనేటర్లను, మల్టీమీటర్లు, బ్యాగులు, నల్ల టోపీలు, రీచార్జబుల్‌ బ్యాటరీలు, క్యాంపు సామగ్రి, బ్యానర్లు, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యేక ఆపరేషన్‌ బృందాలు బుధవారం లడపదర్‌ రిజర్వ్‌ ఫారెస్టు ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తుండగా నక్సల్స్‌ క్యాంపు కనిపించడంతో    పరిశీలించగా ఈ వస్తువులు లభించినట్లు  ఎస్పీ ప్రతీక్‌సింగ్‌ తెలిపారు. సంఘ విద్రోహ శక్తులను అణచివేసేందుకు కఠినంగా వ్యవహరిస్తామని ఆయన అన్నారు. నక్సల్స్‌ కోసం అటవీ ప్రాంతంలో గాలింపు కొనసాగిస్తామని పేర్కొన్నారు.


logo