శనివారం 05 డిసెంబర్ 2020
National - Oct 28, 2020 , 13:06:44

యువ‌తి కాల్చివేత కేసు.. ముమ్మ‌రంగా సిట్ ద‌ర్యాప్తు

యువ‌తి కాల్చివేత కేసు.. ముమ్మ‌రంగా సిట్ ద‌ర్యాప్తు

న్యూఢిల్లీ: హ‌ర్యానా రాష్ట్రం ఫ‌రీదాబాద్ జిల్లాలోని వ‌ల్ల‌భ్‌గ‌ఢ్ టౌన్‌లో నిఖిత తోమ‌ర్ అనే యువ‌తిని కాల్చిచంపిన ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తును స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్ (సిట్‌) ముమ్మ‌రం చేసింది. ఇప్ప‌టికే స్థానిక పోలీసుల నుంచి అన్ని వివ‌రాలు సేక‌రించిన సిట్.. తాజాగా మృతురాలి ఇంటికి వెళ్లింది. అక్క‌డ అమె త‌ల్లిదండ్రులు, ఇత‌ర కుటుంబ‌స‌భ్యుల‌తో మాట్లాడి అవ‌స‌ర‌మైన వివ‌రాలు అడిగి తెలుసుకుంది. స‌కాలంలో ద‌ర్యాప్తు పూర్తిచేసి రాష్ట్ర ప్ర‌భుత్వానికి నివేదిక స‌మర్పిస్తామ‌ని సిట్‌కు నేతృత్వం వ‌హిస్తున్న క్రైమ్ బ్రాంచ్ పోలీస్ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్ చెప్పారు. 

కాగా, సోమ‌వారం మ‌ధ్యాహ్నం మూడున్న‌ర గంట‌ల స‌మ‌యంలో కాలేజీలో ప‌రీక్ష రాసి బ‌య‌ట‌కు వ‌చ్చిన నిఖిత (21) అనే యువ‌తిని, అక్క‌డే స్నేహితుడితో కలిసి కారులో మాటువేసి ఉన్న‌తౌసీఫ్ కిడ్నాప్ చేసేందుకు ప్ర‌య‌త్నించాడు. ఆమె తీవ్రంగా ప్ర‌తిఘ‌టించ‌డంతో తుపాకీతో త‌ల‌పై కాల్చి పారిపోయాడు. తీవ్రంగా గాయ‌ప‌డ్డ ఆమెను స్థానికులు ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే మృతిచెందిన‌ట్లు వైద్యులు ధ్రువీక‌రించారు. అయితే, ఈ ఘ‌ట‌న‌పై తీవ్రంగా స్పందించిన హ‌ర్యానా ప్ర‌భుత్వం స‌త్వ‌ర ద‌ర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేసింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.