శుక్రవారం 05 జూన్ 2020
National - May 21, 2020 , 10:47:40

224 మందితో ఆస్ట్రేలియా నుంచి బయల్దేరిన మొదటి విమానం

224 మందితో ఆస్ట్రేలియా నుంచి బయల్దేరిన మొదటి విమానం

సిడ్నీ: కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌తో ఆస్ట్రేలియాలో చిక్కుకుపోయిన 224 మంది భారతీయులతో ఎయిర్‌ ఇండియా ప్రత్యేక విమానం సిడ్నీ నుంచి బయల్దేరింది. ఇది ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి చేరుకోనుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్రప్రభుత్వం చేపట్టిన వందే భారత్‌ మిషన్‌లో భాగంగా ఆస్ట్రేలియా నుంచి వస్తున్న మొదటి విమానం ఇదే కావడం విశేషం.

ఈ నెల 7న ప్రారంభమైన మొదటి విడత వందేభారత్‌ మిషన్‌ మొదటి విడతలో 12 దేశాల నుంచి 15 వేల  మంది భారతీయులను 64 ప్రత్యేక విమానాల్లో దేశానికి తీసుకువచ్చారు. మే 16 నుంచి మే 22 వరకు కొనసాగనునన్న రెండో విడతలో 21 దేశాల నుంచి 32 వేల మంది భారతీయులను తీసుకువస్తున్నారు. 


logo