మంగళవారం 29 సెప్టెంబర్ 2020
National - Aug 10, 2020 , 09:06:46

వందేభార‌త్ మిష‌న్‌.. సిడ్నీ నుంచి బ‌య‌లుదేరిన విమానం

వందేభార‌త్ మిష‌న్‌.. సిడ్నీ నుంచి బ‌య‌లుదేరిన విమానం

హైద‌రాబాద్‌: వందే భార‌త్ మిష‌న్‌లో భాగంగా ఇవాళ సిడ్నీ నుంచి ఢిల్లీకి విమానం బ‌య‌లుదేరింది.  ఎయిర్ ఇండియా ప్ర‌త్యేక విమానం ఏఐ-301 సిడ్నీ ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన‌ట్లు అధికారులు తెలిపారు.  క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో వివిధ దేశాల ఎయిర్‌లైన్స్ విమానాల‌ను నిలిపివేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వివిధ దేశాల్లో చిక్కుకున్న వారిని తీసుకు వ‌చ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం వందేభార‌త్ మిష‌న్ స్టార్ట్ చేసింది.  దీంట్లో భాగంగా విదేశాల్లో చిక్క‌కున్న భార‌తీయుల‌ను వెన‌క్కి తీసుకువ‌స్తున్నారు.  ఇప్ప‌టి వ‌ర‌కు ల‌క్ష‌ల సంఖ్య‌లో భార‌తీయుల‌ను వందేభార‌త్ మిష‌న్‌లో భాగంగా త‌ర‌లించారు. ఇవాళ సిడ్నీ నుంచి ఢిల్లీకి విమానం బ‌య‌లుదేరిన‌ట్లు సిడ్నీలోని కౌన్సులేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా పేర్కొన్న‌ది. క‌రోనా ఆంక్ష‌ల‌ను పాటిస్తూ ప్ర‌యాణికులు భార‌త్‌కు ప‌య‌నం అయ్యారు. logo