ఆదివారం 24 జనవరి 2021
National - Dec 30, 2020 , 15:53:49

ధ‌ర్మేగౌడ మృతిపై స్వ‌తంత్ర సంస్థ‌ ద‌ర్యాప్తు: లోక్‌స‌భ స్పీక‌ర్‌

ధ‌ర్మేగౌడ మృతిపై స్వ‌తంత్ర సంస్థ‌ ద‌ర్యాప్తు: లోక్‌స‌భ స్పీక‌ర్‌

న్యూఢిల్లీ: క‌ర్ణాట‌క శాస‌న‌మండ‌లి డిప్యూటీ ఛైర్మ‌న్ ఎస్ఎల్ ధ‌ర్మేగౌడ‌ ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న‌పై లోక్‌స‌భ స్పీక‌ర్ ఓంబిర్లా స్పందించారు. ధ‌ర్మేగౌడ మ‌ర‌ణ‌వార్త త‌న‌ను చాలా బాధించింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ నెల 15న మండ‌లిలో స‌భాప‌తి స్థానంలో ఆసీనులై ఉన్న ధ‌ర్మేగౌడను కొంద‌రు స‌భ్యులు లాగిప‌డేయడం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని ఓంబిర్లా వ్యాఖ్యానించారు. ఆ ఘ‌ట‌న ప్ర‌జాస్వామ్యంపై జ‌రిగిన తీవ్ర‌మైన దాడి అని ఆయ‌న‌‌ అభివ‌ర్ణించారు. 

ధ‌ర్మేగౌడ మృతిపై ఉన్న‌త‌స్థాయి ద‌ర్యాప్తున‌కు ఆదేశించిన‌ట్లు లోక్‌స‌భ స్పీకర్ ఓంబిర్లా ప్ర‌క‌టించారు. ఒక స్వ‌తంత్ర ద‌ర్యాప్తు సంస్థ ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు జ‌రుపుతుంద‌ని తెలిపారు.  ‌     

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo