సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Feb 27, 2020 , 02:25:23

జైలుకు ఆజంఖాన్‌ కుటుంబం

జైలుకు ఆజంఖాన్‌ కుటుంబం

లక్నో: నకిలీ జనన ధ్రువీకరణ పత్రం కేసులో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజంఖాన్‌, ఆయన భార్యతజీన్‌ ఫాత్మ, కుమారుడు, ఎమ్మెల్యే అబ్దుల్లా ఆజంకు కోర్టు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. స్వార్‌ నుంచి గెలుపొందిన అబ్దుల్లా రెండు జనన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉన్నాడని, 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తప్పుడు ధ్రువ పత్రాన్ని సమర్పించాడని పేర్కొంటూ బీజేపీ నేత ఆకాశ్‌ సక్సెనా 2019లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు  కేసు నమోదు చేశారు. అబ్దుల్లా రెండో నకిలీ జనన ధ్రువీకరణ పత్రం పొందేందుకు  అఫిడవిట్‌లో సంతకాలు చేసినందుకు ఆజంఖాన్‌, తజీన్‌పైనా కేసు నమోదు చేశారు. 


logo