గురువారం 28 మే 2020
National - May 19, 2020 , 14:54:05

యూపీలో ఎస్పీ నేత, అతని కుమారుడి దారుణహత్య

యూపీలో ఎస్పీ నేత, అతని కుమారుడి దారుణహత్య

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ నాయకుడు, అతని కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. సంభాల్‌ జిల్లాలోని బహ్‌జోయ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనుల విషయంలో మొదలైన గొడవ హత్యకు దారితీసింది. సంభాల్‌ జిల్లా సరోయ్‌ గ్రామానికి చెందిన చోటేలాల్‌ దివాకర్‌ 2017లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయాడు. ఆ తర్వాత సరోయ్‌ గ్రామ ప్రధాన్‌గా ఎన్నికయ్యాడు. అయితే ఇటీవల ఉపాధీ హామీ పథకం పనుల విషయమై చోటేలాల్‌కు, గ్రామ మాజీ ప్రధాన్‌కు మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థులు చోటేలాల్‌ను, అతని కుమారుడిని తుపాకీతో కాల్చిచంపారు.


logo