శనివారం 31 అక్టోబర్ 2020
National - Sep 28, 2020 , 02:20:50

నేటి నుంచి నైరుతి తిరోగమనం

నేటి నుంచి నైరుతి తిరోగమనం

  • ఈ సీజన్‌లో మంచి వానలే పడ్డాయి
  • దేశవ్యాప్తంగా సగటున..సాధారణం కంటే ఎక్కువ వర్షం 
  • భారత వాతావరణ విభాగం వెల్లడి

న్యూఢిల్లీ: సోమవారం నుంచి నైరుతి రుతు పవనాలు తిరోగమనం చెందనున్నట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. వచ్చే రెండు రోజుల్లో ఉత్తర భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతు పవనాలు పూర్తిగా తిరోగమనం చెందే అవకాశమున్నట్టు తెలిపింది. ఈ వానకాలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్టు చెప్పింది. ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా శనివారంనాటికి సాధారణం కంటే 9 శాతం ఎక్కువ వర్షపాతం రికార్డయినట్టు వెల్లడించింది. ‘పశ్చిమ రాజస్థాన్‌, పరిసర ప్రాంతాల్లో సోమవారం నుంచి నైరుతి రుతుపవనాలు తిరోగమనం చెందే అవకాశాలున్నాయి’ అని ఐఎండీ ఆదివారం పేర్కొంది. తొమ్మిది రాష్ర్టాల్లో సాధారణం కంటే ఎక్కువ, 20 రాష్ర్టాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్టు వివరించింది.