శనివారం 06 జూన్ 2020
National - May 17, 2020 , 01:05:45

నేడు అండమాన్‌కు నైరుతి రుతుపవనాలు

నేడు అండమాన్‌కు నైరుతి రుతుపవనాలు

హైదరాబాద్ : ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఆదివారం ఉదయం వరకు తుపాను గా మారే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ఆదివారం అది ఉత్తరవాయవ్య దిశగా ప్రయాణించి రెండు రోజుల్లో పశ్చిమబెంగాల్‌ తీరం వైపు వెళ్లే అవకాశం ఉన్నదన్నారు. ఈ ప్రభావంతో ఆది,సోమవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు  కురిసే అవకాశం ఉన్నదన్నారు. ఆదివారం వరకు ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్‌, నికోబార్‌ దీవుల్లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు తాకవచ్చని తెలిపారు.


logo