గురువారం 13 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 19:21:53

విరాళంగా వ‌చ్చిన డ‌బ్బును స‌ర్ఫ్‌ వేసి వాషింగ్ మెషీన్‌లో వేసిన మ‌హిళ‌! అంతే..

విరాళంగా వ‌చ్చిన డ‌బ్బును స‌ర్ఫ్‌ వేసి వాషింగ్ మెషీన్‌లో వేసిన మ‌హిళ‌! అంతే..

క‌రోనా సంగ‌తి ఏమో గాని ప్ర‌జ‌ల్లో శుభ్రత ఎక్కువైపోయింది. ఇంటికి తెచ్చిన ప్ర‌తి వ‌స్తువును క‌డిగి పారేస్తున్నారు. అవి వ‌స్తువులు అయితే ప‌ర్వాలేదు. క‌డ‌గ‌కూడ‌ని వాటిని కూడా నీటిలో ముంచితే ఎలా. అస‌లే ఎంతో క‌ష్ట‌ప‌డి సంపాదిస్తే గాని డ‌బ్బులు రావు. అయితే.. ఇటీవ‌ల ఒక మ‌హిళ ఎక్క‌డ క‌రోనా సోకుతుందో అని డ‌బ్బుల‌ను వాషింగ్ మెషీన్‌లో వేసి రెండు రౌండ్లు తిప్పేసింది.

ద‌క్షిణ కొరియాలోని సియోల్‌కు చెందిన కుటుంబంలో ఒక వ్య‌క్తి చ‌నిపోయాడు. ఆ కుటుంబానికి కొంత‌మంది సంతాపం తెలుపుతూ కొంత డ‌బ్బును విరాళంగా ఇచ్చారు. ఇవి సుమారు రూ. 3,137 వ‌ర‌కు ఉన్నాయి. అయితే ఈ డ‌బ్బు ఎంత‌మంది చేతులు మారాయో.. వీటిని  డైరెక్టుగా ఇంట్లో పెడితే క‌రోనా వ‌స్తుందేమో అనే భ‌యంతో స‌ర్ఫ్ వేసి వాషింగ్‌మెషీన్‌లో వేసిందా మ‌హిళ‌. తీరా తీసి చూసేస‌రికి కొన్నినోట్లు ముద్ద ముద్ద‌గా మారిపోయాయి. మ‌రికొన్ని మురికి కాలువ‌లోకి వెళ్లిపోయాయి. అయినా ఇవేం ప‌ట్టించుకోకుండా డ్రై చేసేస‌రికి మిగిలున్న నోట్లు కాస్త వేడికి కాలిపోయాయి. 


తాజావార్తలు


logo