పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే

హైదరాబాద్ : నివర్ తుఫాను దృష్ట్యా ఇవాళ నడవాల్సిన పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. చెన్నై సెంట్రల్-తిరుపతి రైలు, తిరుపతి-చెన్నై, హైదరాబాద్-తంబరం, తంబరం-హైదరాబాద్, మధురై-బికనీర్, బికనీర్-మధురై, చెన్నై సెంట్రల్-సంత్రగచ్చి రైళ్లను క్యాన్సిల్ చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నడిచే ఎనిమిది రైళ్లను దారి మళ్లించారు. మరో రైలును రద్దు చేశారు. నివర్ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నందున ముందస్తు జాగ్రత్తగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ట్రైన్లను క్యాన్సిల్ చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్య తెలిపారు. సికింద్రాబాద్: 040-27833099, విజయవాడ: 0866-2767239, గుంతకల్: 78159 15608, గుంటూరు: 0863 2266138 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. మరో వైపు భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో మరో 11 గంటల పాటు చెన్నై ఎయిర్పోర్టును అధికారులు మూసివేశారు.