..ఆ మూడు రాష్ట్రాల్లో త్వరలో పీసీసీల మార్పు

న్యూఢిల్లీ : రానున్న ఎన్నికలలోపు పార్టీని బలోపేతం చేయడంపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టిపెట్టింది. పార్టీ బలహీనపడిన పలు రాష్ట్రాల్లో సంస్థాగత నిర్మాణానికి చర్యలు చేపట్టింది. త్వరలో తెలంగాణ, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలకు కొత్త ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను నియమించనున్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఇప్పటికే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణికం ఠాగూర్ రాష్ట్రంలో దాదాపు 160 మంది కాంగ్రెస్ ముఖ్యనేతలతో మాట్లాడి వారి అభిప్రాయాన్ని తీసుకున్నారు. ఇప్పటికే ఈ నివేదికను కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఆయన సమర్పించారు.
ఇక పంజాబ్‌లో పీసీపీ మార్పుపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి హరీశ్ రావత్ స్పందించారు. ‘ రాష్ట్ర పీసీసీ అమలులోనే ఉంది. ప్రస్తుతం జిల్లా కమిటీల నియామకానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రైతుల సమస్యలను కేంద్రం పరిష్కరించిన వెంటనే కొత్త జిల్లా కమిటీలను నియమిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.
గుజరాత్లో పీసీసీ మార్పుపై ఇప్పుడే స్పందించలేమని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి పేర్కొన్నారు. దీనిపై కసరత్తు చేస్తున్నామని, పీసీసీ మార్పు ఉండేది లేదని డిసెంబర్ చివరినాటికి స్పష్టత వస్తుందని ఆయన వెల్లడించారు. ఇదిలాఉండగా ఇప్పటికే ముంబై ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ, మణిపూర్ కాంగ్రెస్ కమిటీలను కాంగ్రెస్ అధిష్ఠానం మార్చిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- భార్యలతో గొడవపడి ఇద్దరు భర్తల ఆత్మహత్య
- పెంపుడుకుక్కకు అంత్యక్రియలు...!
- తెలుగు ప్రజల ఆరాధ్యదైవం ‘అన్న’ కన్నుమూత
- బ్రిస్బేన్‌లో వర్షం.. ముగిసిన నాలుగో రోజు ఆట
- ట్రాక్టర్ల ర్యాలీపై ఢిల్లీ పోలీసులదే తుది నిర్ణయం..
- కంగనా యాక్షన్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..!
- కూకట్‌పల్లిలో దారుణం.. కుమారుడికి నిప్పంటించిన తండ్రి
- ఐపీఎల్లో కొత్తగా ఒక్క టీమే!
- నిర్మాత దొరస్వామి రాజు మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
- రామమందిర నిర్మాణానికి అక్షయ్ విరాళం