మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 17:03:15

'ఆజీ మా'కు సాయం అందించేందుకు ముందుకు వ‌స్తున్న స్టార్లు!

'ఆజీ మా'కు సాయం అందించేందుకు ముందుకు వ‌స్తున్న స్టార్లు!

వ‌య‌సు మీద‌ప‌డ్డాక‌ కృష్ణా, రామా అంటూ కూర్చోవాల్సిన వ‌య‌సులో ఇలా రోడ్డు మీద‌కు వ‌చ్చి ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇస్తుంటే ఆ త‌ల్లి ఎలాంటి ద‌య‌నీయ స్థితిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఫైట్ మాస్ట‌ర్లు చేతి క‌ర్ర‌ను ప‌ట్టుకొని గిరా గిరా తిప్పుతూ ఎదుటి వారిని చిత‌క‌బాదే మార్ష‌ల్ ఆర్ట్స్ చేయాలంటే ఎంతో నైపుణ్యం ఉండాలి. అలాంటి విన్యాసాన్ని అల‌వోక‌గా చేస్తున్న 75 ఏండ్ల పూణె బామ్మ‌కు అంద‌రూ ఫిదా అవుతున్నారు. ఈమె పేరు ఆజి మా. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ్వ‌డంతో సెల‌బ్రిటీల‌ను సైతం ఆక‌ట్టుకుంటున్న‌ది.

బాలీవుడ్ న‌టులు రితీష్ దేశ్‌ముఖ్ ఆమెను అభినందించారు. ర‌ణ‌దీప్ హుడా, సోనూసూద్ వంటి హీరోలు ఈ బామ్మ‌కు సాయం అందించేందుకు ముందుకు వ‌చ్చారు. ‘వారియర్ ఆజీ’గా చక్కర్లు కొడుతున్నఈ  వీడియోకు సోనూసూద్ చూసి ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'ఎవ‌రైనా ఈ బామ్మ వివ‌రాలు ఇవ్వ‌గ‌ల‌రా.. ఆమెతో చిన్న ట్రైనింగ్ సెంట‌ర్ ప్రారంభిస్తాను. ఆమె ద్వారా దేశంలోని మ‌హిళ‌ల‌కు ఆత్మర‌క్ష‌ణ‌లో శిక్ష‌ణ ఇప్పిస్తాను' అని సోనూసూద్ పేర్కొన్నారు. 


logo