రెబల్స్‌తో సోనియా భేటీ.. టెన్ జన్‌పథ్‌కు చేరిన నేతలు

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తన నివాసంలో శనివారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీలోని విధానపరమైన లోపాలను ఎత్తిచూపుతూ లేఖ రాసిన తిరుగుబాటు నేతల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. ఈ మేరకు శనివారం ఉదయం పది గంటల ప్రాంతంలో టెన్ జన్‌పథ్‌లోని సోనియా నివాసానికి గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, బీఎస్ హుడా, అంబికా సోని, పి చిదంబరంతో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకులు అశోక్ గెహ్లాట్ చేరుకున్నారు. కరోనా మహమ్మారి నాటి నుంచి ప్రత్యక్ష సమావేశాలు లేకుండా పోగా.. కొవిడ్ అనంతరం జరుగుతున్న తొలి సమావేశం ఇదే కావడం గమనార్హం. ఈ క్రమంలో పూర్తి స్థాయి ప్రక్షాళన దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందా? పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయా? అనేది ప్రస్తుతం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పార్టీకి పూర్తికాలపు అధ్యక్షుడు, ప్రభావవంతమైన నాయకుడు ఉండాలంటూ ఆగస్టులో లేఖ రాసిన 23 మంది సీనియర్లకు, గాంధీ కుటుంబానికి మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యతలను ఆ పార్టీ సీనియర్ నేత కమల్‌నాథ్ తలకెత్తుకున్నారు.
ప్రస్తుతం వ్యవహరిస్తున్న తరహాలో కాకుండా పార్టీలో అన్ని స్థాయిల్లోని పదవులకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని అసంతృప్త నేతలు డిమాండ్ చేస్తున్నారు. శనివారం నుంచి సమావేశాలు పది రోజుల పాటు వరుసగా భేటీ నిర్వహించనున్నారు. అయితే, రాహుల్ గాంధీయే తిరిగి పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టాలని 99.99 శాతం కార్యకర్తలు కోరుకుంటున్నారని ఆ పార్టీ నేత రణదీప్ సూర్జేవాలా పేర్కొన్నారు. రాహుల్ గాంధీ బాధ్యతలు తీసుకునేందుకు ససేమిరా అంటున్నా.. ఆయన అనుమతితోనే అన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విషయం విమర్శలూ ఉన్నాయి. మరో వైపు ప్రధాని మోదీ, అధికార బీజేపీని ధాటిగా ఎదుర్కొనే నాయకుడిగా రాహుల్‌కు మంచి గుర్తింపు ఉంది. గాంధీ కుటుంబేతరులను కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నుకోవడం అనివార్యమే అయితే.. నాయకుల మధ్య పోటీ ఆసక్తికరంగా మారనుంది.
తాజావార్తలు
- కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్
- ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు కీలకం
- జంగుబాయి క్షేత్రం జనసంద్రం
- మాజీ సర్పంచ్ మృతికి పలువురి సంతాపం
- మిర్యాలగూడ శివారు ప్రాంతాల అభివృద్ధికి కృషి
- ఏడు పదులకుఎన్నో ఫలాలు
- నాటు వేసిన ఐఎఫ్ఎస్ అధికారి
- ఉపాధి కల్పనకు ప్రభుత్వం చర్యలు
- పోలీసుల కవాతు పరిశీలన
- ఆపదలో షీటీమ్‌లను ఆశ్రయించాలి