బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Feb 27, 2020 , 16:04:37

రాష్ట్ర‌ప‌తికి లేఖ స‌మ‌ర్పించిన సోనియా, మ‌న్మోహ‌న్‌

రాష్ట్ర‌ప‌తికి లేఖ స‌మ‌ర్పించిన సోనియా, మ‌న్మోహ‌న్‌

హైద‌రాబాద్‌: ఢిల్లీ అల్ల‌ర్ల‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ సోనియా, మ‌న్మోహ‌న్‌లు ఇవాళ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ను క‌లిశారు.  ఢిల్లీలో ప్ర‌జ‌ల స్వేచ్ఛ‌ను, ఆస్తుల‌ను ర‌క్షించాల‌ని రాష్ట్ర‌ప‌తిని కోరిన‌ట్లు సోనియా తెలిపారు. హింస‌ను నియంత్రించ‌డంలో హోంమంత్రి అమిత్ షా విఫ‌ల‌మ‌య్యార‌ని, ఆయ‌న్ను తొల‌గించాల‌ని ఆమె డిమాండ్ చేశారు. ఢిల్లీలో గ‌త నాలుగు రోజుల్లో చోటుచేసుకున్న ప‌రిణామాల‌ను రాష్ట్ర‌ప‌తికి వివ‌రించామ‌ని మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ తెలిపారు. అల్ల‌ర్ల‌లో 34 మంది మ‌ర‌ణించార‌ని, ఇది దేశానికి అవ‌మాన‌క‌ర‌మైన సంఘ‌ట‌న అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం సంపూర్ణంగా విఫ‌ల‌మైంద‌న్నారు.

logo
>>>>>>