ఆదివారం 05 జూలై 2020
National - Jun 16, 2020 , 10:32:36

పెట్రోల్ మోత‌.. మోదీకి లేఖ రాసిన సోనియా గాంధీ

 పెట్రోల్ మోత‌.. మోదీకి లేఖ రాసిన సోనియా గాంధీ

హైద‌రాబాద్: పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెరుగుతున్న తీరు ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ట్లు కాంగ్రెస్ నేత సోనియా గాంధీ అన్నారు.  ప్ర‌ధాని మోదీకి ఈ అంశంపై ఇవాళ సోనియా లేఖ రాశారు. ప్ర‌జ‌ల బాధ‌ల‌ను తీర్చ‌డం ప్ర‌భుత్వ బాధ్య‌త కావాల‌న్నారు. క‌ష్టాల్లో ఉన్న ప్ర‌జ‌ల‌ను మ‌రింత ఇబ్బందిపెట్ట‌డం స‌రికాదు అన్నారు. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ప్ర‌జ‌ల నుంచి ప్ర‌భుత్వం లాభం పొందే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ద‌ని సోనియా ఆరోపించారు. పెరిగిన ధ‌ర‌ల‌ను వెంట‌నే త‌గ్గించాల‌ని,  త‌క్కువ‌గా ఉన్న చ‌మురు ధ‌ర‌ల లాభాన్ని ప్ర‌జ‌ల‌కు అందే విధంగా చూడాల‌ని ఆమె త‌న లేఖ‌లో కోరారు.

ఇటీవ‌ల వ‌రుస‌గా దేశంలో ఇంధ‌న ధ‌ర‌లు పెరిగాయి. వరుసగా తొమ్మిదో రోజు కూడా ఇంధ‌న ధ‌ర‌ల‌ను పెంచారు. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు సోమవారం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ నిర్ణయిం తీసుకొన్నాయి. పెట్రోల్ పై 48 పైసలు, డీజిల్ పై 59 పైసలు పెంచుతున్నట్టు చమురు సంస్థలు ప్రకటించాయి. logo