శనివారం 30 మే 2020
National - May 20, 2020 , 09:55:40

22న ప్రతిపక్ష పార్టీలతో సోనియా వీడియో కాన్ఫరెన్స్‌

22న ప్రతిపక్ష పార్టీలతో సోనియా వీడియో కాన్ఫరెన్స్‌

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ప్రతిపక్ష పార్టీలతో ఈ నెల 22న వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. సోనియా గాంధీ అధ్యక్షతన జరిగే ఈ కాన్ఫరెన్స్‌లో.. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులతో పాటు కరోనా వైరస్‌ తీవ్రతపై చర్చించనున్నారు. వలస కార్మికుల సమస్యలు, రాష్ర్టాలు కార్మిక చట్టాలను నిలిపివేయడం వంటి అంశాలు చర్చకు రానున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సమావేశంలో కరోనా మహమ్మారికి సంబంధించి కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై కూడా చర్చించనున్నారు.  

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు 18 పార్టీలను సోనియా ఆహ్వానించారు. డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటామని అంగీకరించాయి. భారత్‌లో ఇప్పుడు నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ఇది మంచి సమయని.. తప్పకుండా కాన్ఫరెన్స్‌లో పాల్గొంటానని మమత పేర్కొన్నారు. ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ కూడా హాజరు కానున్నారు. 


logo