శనివారం 04 జూలై 2020
National - Jun 23, 2020 , 13:17:34

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీడబ్ల్యూసీ సమావేశం

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీడబ్ల్యూసీ సమావేశం

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం మంగళవారం జరిగింది. వీడియో కార్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన ఈ భేటీలో మాజీ ప్రధాని, పార్టీ సీనియర్‌ నేత డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌, రాహుల్‌ గాంధీతోపాటు ఇతర నేతలు పాల్గొన్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చినప్పటికీ దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత పెరుగుతూనే ఉన్నదని సోనియా గాంధీ ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా నియంత్రణ భారాన్ని రాష్ట్రాలపై మోపిన మోదీ, అదనంగా ఎలాంటి ఆర్థిక సహాయం చేయలేదని ఆరోపించారు. సీడబ్ల్యూసీలో సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేత ఆర్‌ఎస్‌ సుర్జేవాలా ట్వీట్టర్‌ ద్వారా వెల్లడించారు. 

logo