మంగళవారం 31 మార్చి 2020
National - Mar 12, 2020 , 01:34:36

శివకుమార్‌కు కర్ణాటక పీసీసీ పగ్గాలు

శివకుమార్‌కు కర్ణాటక పీసీసీ పగ్గాలు

న్యూఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్‌ ప్రదేశ్‌ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడిగా డీకే శివకుమార్‌ను ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నియమిస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. దినేశ్‌ గుండూరావు స్థానంలో శివకుమార్‌ బాధ్యతలు స్వీకరిస్తారు. కర్ణాటక సీఎల్పీ నేతగా, మాజీ సీఎం సిద్దరామయ్య కొనసాగనున్నారు. శివకుమార్‌కు కాంగ్రెస్‌లో ట్రబుల్‌ షూటర్‌గా పేరుంది. కాగా, ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడిగా అనిల్‌ చౌదరిని సోనియాగాంధీ నియమించారు.


logo
>>>>>>