సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Feb 28, 2020 , 16:28:30

సోనియాజీ.. రాజ‌ధ‌ర్మం నేర్పొద్దు

సోనియాజీ.. రాజ‌ధ‌ర్మం నేర్పొద్దు

హైద‌రాబాద్‌:  రాజ‌ధ‌ర్మం గురించి సోనియా గాంధీ మాకు పాఠాలు చెప్ప‌డం స‌రికాద‌ని కేంద్ర మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ అన్నారు.  పరిపాల‌నా బాధ్య‌త‌ల‌ను సోనియా మాకు చెప్ప‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు. మీ రికార్డుల‌ను ఓ సారి ప‌రిశీలించుకోవాల‌ని ఆయన అన్నారు.  ప‌దేప‌దే మీరు ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డ్డార‌ని,  ఓటు బ్యాంకు రాజ‌కీయాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ప‌న్నాగాలు వేసిందో త‌మ‌కు తెలుస‌ని మంత్రి ర‌విశంక‌ర్ అన్నారు.  క‌పిల్ మిశ్రా వ్యాఖ్య‌ల‌ను పార్టీ ఆమోదించ‌లేద‌ని మంత్రి తెలిపారు.  ఢిల్లీ అల్ల‌ర్ల‌ను అదుపు చేయ‌డంలో కేంద్ర ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని,  హోంమంత్రి రాజీనామా చేయాల‌ని .. సోనియా నేతృత్వంలో కాంగ్రెస్ నేత‌లు రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ స‌మ‌ర్పించిన విష‌యం తెలిసిందే.  


logo