శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 30, 2020 , 17:21:49

రాజ్య‌స‌భ స‌భ్యుల‌తో సోనియా స‌మావేశం

రాజ్య‌స‌భ స‌భ్యుల‌తో సోనియా స‌మావేశం

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన స‌భ్యుల‌తో ఆ పార్టీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ గురువారం స‌మావేశం నిర్వ‌హించారు. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా నిర్వ‌హించిన ఈ స‌మావేశంలో రాజ్య‌స‌భ స‌భ్యుల‌తో పాటు పార్టీ సీనియ‌ర్లు మ‌న్మోహ‌న్ సింగ్, ఏకే ఆంటోనీ, అహ్మ‌ద్ ప‌టేల్, గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ‌, మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే, అంబికా సోని, చిదంబ‌రం, జైరాం ర‌మేశ్ కూడా పాల్గొన్నారు. 

దేశంలో ప్ర‌స్తుత ఆర్థిక ప‌రిస్థితి, కొవిడ్ నివార‌ణ చ‌ర్య‌ల‌తో పాటు ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల‌పై సోనియా పార్టీ నాయ‌కుల‌తో చ‌ర్చించారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే పార్ల‌మెంట్ స‌మావేశాల్లో కేంద్ర ప్ర‌భుత్వాన్ని గ‌ట్టిగా నిల‌దీయాల‌ని ఎంపీల‌కు సోనియా సూచించారు. కొవిడ్ 19 కేసులు పెరిగిపోతుండ‌డంతో ఆమె ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. కొద్దిరోజుల క్రితం లోక్‌స‌భ ఎంపీల‌తో కూడా సోనియా వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. 


logo