శనివారం 06 జూన్ 2020
National - May 17, 2020 , 14:46:54

14 భాషలు... 211 మంది గాయకులు.. ఒకే పాట...

14 భాషలు... 211 మంది గాయకులు.. ఒకే పాట...

కరోనా కట్టడిలో మేము సైతం అంటున్నారు గాయకులు. ప్రజలను ప్రతి ఉపద్రవం నుంచి జాగృతం చేయడంలో మన గాయకులు ముందుంటారు. అయిఏ ప్రస్తుతం ఎదుర్కుంటున్న కరోనా విపత్తును అందరికంటే ఎక్కువగా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతున్న వారు వైద్యులు. వారికి సంఘీభావం తెలుపుతూ ‘జయతు జయతు భారతం’ అంటూ పాట పాడుతూ వైద్యులకు సేవ చేసేందుకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చారు మన గాయకులు. ఈ పాట కోసం దేశంలోని ప్రతి భాషలోని ప్రముఖ గాయకులు తమ స్వరాన్ని అందించారు.

వారిలో మన తెలుగు గాయకులు బాల సుబ్రహ్మణ్యం కూడా ఉన్నారు. ఆయనతో పాటు ప్రముఖ గాయకులు ఆశాభోంసే, శంకర్‌ మహాదేవన్‌, హరిహరన్‌, కైలాశ్‌ ఖేర్‌, ఉదిత్‌ నారాయణ్‌ వంటి ఎందరో ప్రముఖ గాయకులు ఈ పాటలో భాగస్వామ్యం అయ్యారు. దేశ వ్యాప్తంగా ఉన్న భాషల్లో తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడం, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, మలయాళం, బోజ్‌పూరీ, అస్సామీ, కాశ్మీరీ, రాజస్థానీ, సింధి, ఒడియా మొత్తం 14 భాషలలో గాయకుల పాట పాడి వీడియోను జాతికి అంకితమిస్తున్నట్లు పేర్కొన్నారు. logo