ఆదివారం 17 జనవరి 2021
National - Nov 29, 2020 , 01:29:46

దేశరక్షణలో అమరుడైన పంజాబ్‌ రైతు కుమారుడు

దేశరక్షణలో అమరుడైన పంజాబ్‌ రైతు కుమారుడు

చండీగఢ్‌: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఒకవైపు పంజాబ్‌ రైతులు ఉద్యమిస్తుండగా అదే రాష్ట్రానికిచెందిన ఓ రైతు కుమారుడు దేశ రక్షణలో అమరుడయ్యాడు. తరన్‌ తరన్‌ జిల్లాకు చెందిన రైతు కుల్వంత్‌ సింగ్‌ శుక్రవారం ‘చలో ఢిల్లీ’ ర్యాలీలో పాల్గొనడానికి సిద్ధమవుతుండగా ఆర్మీ అధికారుల నుంచి ఫోన్‌ వచ్చింది. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి సెక్టార్‌లో ఎల్‌వోసీ వద్ద విధులు నిర్వహిస్తున్న ఆయన చిన్న కుమారుడు, రైఫిల్‌మ్యాన్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌ పాక్‌ కాల్పుల్లో మరణించినట్లు తెలిపారు. కుమారుడి మరణవార్త విన్న ఆ తండ్రి హతాశుడయ్యారు. కాగా, సీఎం అమరీందర్‌ సింగ్‌ రూ.50 లక్షల పరిహారం ప్రకటించారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు.