e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home News మ‌హారాష్ట్ర నుంచి ఇస్రోకు సైంటిస్ట్‌గా ఎంపికైన తొలి స్టూడెంట్‌ ఇత‌నే..

మ‌హారాష్ట్ర నుంచి ఇస్రోకు సైంటిస్ట్‌గా ఎంపికైన తొలి స్టూడెంట్‌ ఇత‌నే..

మ‌హారాష్ట్ర నుంచి ఇస్రోకు సైంటిస్ట్‌గా ఎంపికైన తొలి స్టూడెంట్‌ ఇత‌నే..

ముంబై: అబ్దుల్ క‌లాం గురించి సీరియ‌స్‌గా చ‌దువుతున్న ఇత‌ని పేరు సోమ్‌నాథ్ మాలి. ఇత‌డు మ‌హారాష్ట్ర నుంచి ఇస్రోలో సీనియ‌ర్ సైంటిస్ట్‌గా ఎంపికైన తొలి స్టూడెంట్‌గా నిలిచాడు. ఈ నెల 2న తిరువ‌నంత‌పురంలోని విక్ర‌మ్ సారాభాయ్ స్పేస్ సెంట‌ర్‌లో సీనియ‌ర్ సైంటిస్టుగా ఎంపిక‌య్యాడు. షోలాపూర్ జిల్లా పండ‌రిపూర్ మండ‌లంలోని స‌ర్కోలీ గ్రామానికి చెందిన సోమ్‌నాథ్ ఓ వ్య‌వ‌సాయ కుటుంబానికి చెందిన వాడు. మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశాడు. ఐఐటీ ఢిల్లీ నుంచి ప్ర‌స్తుతం మెకానిక‌ల్ డిజైన్ చేస్తున్నాడు.

2016లో తొలిసారి ఇస్రోలో ఈ జాబ్ కోసం ట్రై చేసినా ఫెయిల‌య్యాడు. మ‌ళ్లీ 2019లో త‌న ఎంటెక్ డిగ్రీపై మ‌రోసారి ద‌ర‌ఖాస్తు చేసుకోగా.. తాజాగా ఆ జాబ్ త‌న‌కు వ‌చ్చింద‌ని చెప్పాడు. ఓ మారుమూల గ్రామంలోని పాడుబ‌డిన స్కూల్ నుంచి ఇస్రో సీనియ‌ర్ సైంటిస్టుగా అత‌డు ఎదిగిన తీరు ఎంద‌రికో స్ఫూర్తి క‌లిగించేదే. త‌న‌ను ఉన్న‌త చ‌దువులు చ‌దివించ‌డానికి త‌న‌ తండ్రితోపాటు సోద‌రులు కూడా కూలి ప‌నులు చేశారని అత‌డు చెప్పాడు.

- Advertisement -

గేట్‌లో 916వ ర్యాంక్ సాధించి ఐఐటీ ఢిల్లీలో మెకానిక‌ల్ డిజైన‌ర్‌గా చేరిన సోమ్‌నాథ్‌.. అక్క‌డే ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ డిజైన్‌పై ప‌ని చేసే అవ‌కాశం ద‌క్కించుకున్నాడు. ఆక్ర‌మంలోనే తాను ఎన్నాళ్లుగానో క‌ల‌లు క‌న్న ఇస్రోలో సైంటిస్టు ఉద్యోగాన్ని కూడా సాధించాడు. ఇప్పుడు మ‌హారాష్ట్ర‌లో యువ‌త‌కు సోమ్‌నాథ్ ఓ ఐకాన్‌గా నిలిచాడు.త‌మ‌కు ఎంతో గ‌ర్వ‌కార‌ణంగా నిలిచిన సోమ్‌నాథ్‌ను.. ఈ మ‌ధ్యే అత‌ని సొంత గ్రామ‌స్థులు స‌త్క‌రించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మ‌హారాష్ట్ర నుంచి ఇస్రోకు సైంటిస్ట్‌గా ఎంపికైన తొలి స్టూడెంట్‌ ఇత‌నే..
మ‌హారాష్ట్ర నుంచి ఇస్రోకు సైంటిస్ట్‌గా ఎంపికైన తొలి స్టూడెంట్‌ ఇత‌నే..
మ‌హారాష్ట్ర నుంచి ఇస్రోకు సైంటిస్ట్‌గా ఎంపికైన తొలి స్టూడెంట్‌ ఇత‌నే..

ట్రెండింగ్‌

Advertisement