బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 03, 2020 , 15:51:08

ఎవరో అబద్ధాలు చెబుతున్నారు.. మోదీపై రాహుల్ విమర్శ

ఎవరో అబద్ధాలు చెబుతున్నారు.. మోదీపై రాహుల్ విమర్శ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా విమర్శలు చేశారు. భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించడంపై ఎవరో అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ఒక వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. ‘చైనా తమ భూభాగాన్ని ఆక్రమించిందని లఢక్ వాసులు చెబుతున్నారు. ప్రధాని మాత్రం మన భూభాగాన్ని ఎవరూ తీసుకోలేదని అంటున్నారు. ఖచ్చితంగా ఎవరో ఒకరు అబద్ధాలు చెబుతున్నారు’ అని అందులో పేర్కొన్నారు.
చైనా గత కొన్ని రోజులుగా లఢక్ సరిహద్దు ప్రాంతాల్లోకి చొరబడి ఆక్రమణలకు పాల్పడుతున్నదని స్థానికులు ఆరోపిస్తున్న ఓ వీడియోను రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో చేశారు. స్థానికులైన లఢక్ వాసులు, ప్రధాని మోదీతోపాటు కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాటలు విరుద్ధంగా ఉన్నాయి. దీంతో ఎవరో ఒకరు చెప్పేది అబద్ధాలే అని పేర్కొన్నారు. లఢక్ సరిహద్దులోని సైనిక శిబిరాన్ని ప్రధాని మోదీ సందర్శించిన రోజునే రాహుల్ గాంధీ ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేసి ఈ మేరకు వ్యాఖ్యానించారు.

 


logo