మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 22:20:02

రామ మందిరం నిర్మాణంపై శరద్‌ పవార్‌ కీలక వ్యాఖ్యలు

రామ మందిరం నిర్మాణంపై శరద్‌ పవార్‌ కీలక వ్యాఖ్యలు

ముంబై : రామ మందిర నిర్మాణంపై నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత శరద్‌ పవార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టులో అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారన్న నేపథ్యంలో స్పందించారు. ‘కరోనా మహమ్మారిని నిర్మూలించడానికి ఆలయ నిర్మాణం తోడ్పడుతుందని కొందరు భావిస్తున్నారని’ ఆదివారం షోలాపూర్‌లో అన్నారు. ‘కొవిడ్‌-19 నిర్మూలించడం మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత, కానీ కొంత మంది ప్రజలు ఒక మందిరం నిర్మించడం దాని నివారణకు దోహదపడుతుందని భావిస్తారు’ అని పవార్‌ రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ప్రతిపాదిన తేదీపై విలేకరులు అడిగినప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉండగా ముంబై సౌత్‌కు చెందిన శివసేన ఎంపీ అరవింద్‌ సావత్‌ పీటీఐతో మాట్లాడుతూ శ్రీరామచంద్రుడు తన పార్టీకి సంబంధించిన విషయమని, దీనిపై ఎలాంటి రాజకీయాలు లేవని చెప్పారు. ‘రామ మందిర ఉద్యమానికి శివసేన ప్రముఖ వెలుగు. సేన అధ్యక్షుడు ముఖ్యమంత్రి కాక ముందే, బ్యాధతలు చేపట్టిన తర్వాత ఉద్ధవ్‌ ఠాక్రే అయోధ్యను సందర్శించారు’ అని అన్నారు. ‘మహా వికాస్ అఘాది ప్రభుత్వంలో సేన, ఎన్సీపీ, కాంగ్రెస్ భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని నిర్ధారించడం, వారికి భద్రత కల్పించడం అనేది ‘రామరాజ్యం’ (న్యాయం, సత్యం యొక్క నియమం) భావన అని సావంత్ అన్నారు.’ మహారాష్ట్రలో కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా (రాష్ట్ర ప్రభుత్వం) పోరాటంలో దీన్ని ఖచ్చితంగా చేస్తున్నామన్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo