గురువారం 16 జూలై 2020
National - Jun 15, 2020 , 08:43:56

అత్య‌వ‌స‌ర సేవ‌ల కోసం.. ముంబైలో లోక‌ల్ ట్రైన్స్ షురూ

అత్య‌వ‌స‌ర సేవ‌ల కోసం.. ముంబైలో లోక‌ల్ ట్రైన్స్ షురూ

హైద‌రాబాద్‌: ముంబై న‌గ‌రంలో నేటి నుంచి కొన్ని లోక‌ల్ రైళ్ల‌ను న‌డ‌పనున్నారు. అత్య‌వ‌స‌ర స‌ర్వీసుల వారి కోసం ఈ రైళ్లు న‌డ‌ప‌నున్న‌ట్లు వెస్ట్ర‌న్ రైల్వే త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్న‌ది. అయితే ఈ రైళ్ల‌లో సాధార‌ణ ప్ర‌యాణికుల‌కు అనుమ‌తి లేదు. ప్ర‌యాణికులు ఎవ‌రూ స్టేష‌న్ల వ‌ద్ద‌కు రాకూడ‌దంటూ రైల్వే శాఖ ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశాల  మేర‌కు .. అత్య‌వ‌స‌ర స‌ర్వీసుల వారి కోసం లోక‌ల్ రైళ్ల‌ను న‌డుపుతున్న‌ట్లు రైల్వే శాఖ వెల్ల‌డించింది.  ఉద‌యం 5.30 నిమిషాల నుంచి రాత్రి 11.30 నిమిషాల‌కు వ‌ర‌కు ఈ రైళ్లు న‌డ‌వ‌నున్నాయి. 15 నిమిషాల తేడాతో ఆ రైళ్లు న‌డుస్తాయి. చ‌ర్చ్‌గేట్ నుంచి విరార్ మ‌ధ్య ఉన్న రూట్లో ఎక్కువ సంఖ్య‌లో రైళ్లు న‌డ‌వ‌నున్న‌ట్లు రైల్వేశాఖ పేర్కొన్న‌ది. 

 logo