శనివారం 30 మే 2020
National - May 14, 2020 , 16:07:19

సిక్కింలో సైనికుల‌పై హిమ‌పాతం.. ఒకరు గ‌ల్లంతు

సిక్కింలో సైనికుల‌పై హిమ‌పాతం.. ఒకరు గ‌ల్లంతు

న్యూఢిల్లీ: సిక్కింలో దారుణం జ‌రిగింది. విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న భార‌త సైనిక బృందంపై పెద్ద ఎత్తున మంచు చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. బృందంలోని సైనికులంద‌రినీ హిమ‌పాతం క‌ప్పేసింది. ఇది గ‌మ‌నించిన మ‌రో సైనిక బృందం వెంట‌నే ఉన్న‌తాధికారుల‌కు స‌మాచారం చేర‌వేసి, హిమ‌పాతంలో చిక్కుకున్న సైనికుల కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ప‌లువురు సైనికులను సుక్షితంగా బ‌య‌ట‌కు తీసింది. అయితే మ‌రో సైనికుడు గ‌ల్లంత‌య్యాడు. అత‌ని ఆచూకీ కోసం గాలింపు కొన‌సాగుతున్న‌ది.  

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo