మంగళవారం 31 మార్చి 2020
National - Mar 18, 2020 , 11:40:12

భారత జవాన్‌కు కరోనా పాజిటివ్‌

భారత జవాన్‌కు కరోనా పాజిటివ్‌

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటి వరకు భారత్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 147కు చేరింది. ఓ భారత జవాన్‌కు కూడా కరోనా పాజిటివ్‌ అని వైద్య పరీక్షల్లో తేలింది. బాధిత జవాను తండ్రి ఫిబ్రవరి 27న ఇరాన్‌ నుంచి లఢఖ్‌కు తిరిగి వచ్చాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో జవాన్‌ తండ్రిని ఫిబ్రవరి 29 నుంచి మార్చి 6వ తేదీ వరకు లఢఖ్‌ హార్ట్‌ ఫౌండేషన్‌లోని ఐసోలేషన్ వార్డులో ఉంచారు. 

అయితే జవాన్‌ సాధారణ సెలవు మీద ఇంటికెళ్లిన సమయంలోనే ఇరాన్‌ నుంచి ఆయన తండ్రి వచ్చాడు. దీంతో జవాన్‌కు కూడా కరోనా సోకింది. మార్చి 2న తిరిగి ఆర్మీ విధుల్లో చేరాడు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న జవాన్‌కు సోమవారం వైద్య పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్‌ వచ్చింది. జవాన్‌తో పాటు అతని భార్య, సోదరి, ఇద్దరు పిల్లలను ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 

పుణెలోని మిలటరీ ఇనిస్టిట్యూట్‌ ఆఫీసర్‌ కూడా కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడు. అయితే ఈ ఉద్యోగికి ఇంకా వైద్య పరీక్షలు నిర్వహించలేదు. 


logo
>>>>>>