గురువారం 09 జూలై 2020
National - Jun 21, 2020 , 11:01:25

ఆకాశంలో ఖ‌గోళ అద్భుతం!

ఆకాశంలో ఖ‌గోళ అద్భుతం!

న్యూఢిల్లీ: ఆకాశంలో ఖ‌గోళ అద్భుతం ఆవిష్కృత‌మైంది. సూర్యుడికి జాబిల్లి అడ్డురావ‌డంతో గ‌గ‌న త‌లంలో వ‌ల‌యాకార సుంద‌ర దృశ్యం క‌నువిందు చేసింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆదివారం ఉద‌యం 9.15 గంట‌లకు సూర్య‌గ్ర‌హ‌ణం మొద‌లైంది. మ‌న దేశంలో మాత్రం ఉద‌యం 10.14 గంట‌ల‌కు గ్ర‌హ‌ణం ప్రారంభ‌మైంది. ఈ సూర్య‌గ్ర‌హ‌ణం మ‌ధ్యాహ్నం 3.04 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని ఖ‌గోళ శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. మ‌ధ్యాహ్నం 12.10 గంట‌ల‌కు పూర్తిస్థాయి సూర్య‌గ్ర‌హ‌ణం క‌నిపిస్తుంద‌ని చెప్పారు. 

మ‌న దేశంలో ముందుగా గుజ‌రాత్‌లోని ద్వార‌క ప్రాంతంలో సూర్య‌గ్ర‌హ‌ణం క‌నిపించింది. తెలంగాణ‌లో ఉద‌యం 10.15 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1.44 వ‌ర‌కు 51 శాతం, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉద‌యం 10.21 నుంచి మ‌ధ్యాహ్నం 1.49 వ‌ర‌కు 46 శాతం సూర్య‌గ్ర‌హ‌ణం క‌నిపిస్తుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. గ్ర‌హ‌ణం కార‌ణంగా బూమి మీద ప‌డే అతినీలలోహిత కిర‌ణాల‌వ‌ల్ల క‌రోనా వైర‌స్ కొంత‌మేర‌కు త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని వారు తెలిపారు. 

కాగా, సూర్య‌గ్ర‌హ‌ణం కార‌ణంగా దేశంలోని ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రాల‌న్నింటిని మూసివేశారు. గ్ర‌హ‌ణం విడ‌పు అనంత‌రం మ‌హాసంప్రోక్ష‌ణం చేసి ఆల‌యాల‌ను తిరిగి తెరువ‌నున్నారు. ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో మ‌రోసారి సూర్య‌గ్ర‌హ‌ణం ఏర్ప‌డనుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ 2022లో సూర్య‌గ్ర‌హ‌ణం ఏర్ప‌డుతుంద‌న్నారు.   


logo