గురువారం 09 జూలై 2020
National - May 25, 2020 , 12:19:09

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య

హైదరాబాద్‌: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కేపీహెచ్‌బీ పరిధిలో చోటుచేసుకుంది. గచ్చిబౌలి వర్చ్యూస్‌ కన్సల్టింగ్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్న గంగ వెంకట సత్తిరాజు (55) కేపీహెచ్‌బీ ఇందూ ఫార్చ్యూన్‌ ఫీల్డ్స్‌లోని భవనం రెండో అంతస్తుపైనుంచి దూకాడు. గంగ వెంకట సత్తిరాజు తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo