ఆదివారం 24 జనవరి 2021
National - Jan 14, 2021 , 01:45:16

టీ అమ్మి పేద పిల్లల్ని చదివించిన ప్రకాశ్‌రావు కన్నుమూత

టీ అమ్మి పేద పిల్లల్ని చదివించిన ప్రకాశ్‌రావు కన్నుమూత

కటక్‌, జనవరి 13: టీ అమ్ముతూ వచ్చిన డబ్బుతో కటక్‌ బస్తీలోని పిల్లలను చదివించిన ప్రముఖ సామాజిక సేవకుడు, పద్మశ్రీ దేవరపల్లి ప్రకాశ్‌రావు (63) కన్నుమూశారు. ఆయన ఒడిశాలోని కటక్‌లో ఎస్సీబీ వైద్య కళాశాల దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు. కరోనా సోకడంతో గత నెల 25న ఆయనను ఎస్సీబీ దవాఖానలో చేర్పించారు. ప్రకాశ్‌రావు పూర్వీకులు తెలుగువారే. ఏపీలోని ప్రకాశం జిల్లా నుంచి వలస వెళ్లి ఒడిశాలో స్థిరపడ్డారు. 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రకాశ్‌రావుకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. 


logo