శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 03, 2020 , 09:47:28

సోష‌ల్ మీడియాను బ్యాన్ చేస్తారేమో..

సోష‌ల్ మీడియాను బ్యాన్ చేస్తారేమో..

హైద‌రాబాద్‌:  ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్ లాంటి సోష‌ల్ మీడియా అకౌంట్ల‌కు స్వ‌స్తి ప‌ల‌కాల‌నుకుంటున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే.  అయితే మోదీ త‌న మ‌న‌సులో మాట చెప్పారో లేదో.. ప్ర‌తిప‌క్ష స‌భ్యులు దానికి కౌంట‌ర్ స్టార్ట్ చేశారు.  ప్ర‌ధాని అక‌స్మాత్తుగా ఆ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌డం కొంద‌రు విప‌క్ష నేత‌ల‌కు మింగుడుప‌డ‌డం లేదు.  ఇండియాలో సోష‌ల్ మీడియాను నిషేధించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తుందేమో అని కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.  దేశంలో సోష‌ల్ మీడియాను బ్యాన్ చేయాల‌న్న ఉద్దేశంతోనే.. ముంద‌స్తుగా మోదీ ఈ హెచ్చ‌రిక చేసి ఉంటార‌ని శ‌శి థ‌రూర్ త‌న ట్వీట్‌లో వెల్ల‌డించారు.  మంచిని వ్యాప్తి చేయ‌డానికి సోష‌ల్ మీడియా చాలా ఉప‌యుక్తంగా ప‌నిచేస్తుంద‌న్న విష‌యం ప్ర‌ధాని మోదీకి తెలుసు అని, సోష‌ల్ మీడియా ద్వారా పాజిటివ్ ఆలోచ‌న‌ల్ని పెంచ‌వ‌చ్చు అన్నారు.  ఎంతో అవ‌స‌ర‌మైన మెసేజ్‌ల‌ను కూడా చేయ‌వ‌చ్చు అన్నారు. కేవ‌లం విద్వేష ప్ర‌సంగాల‌ను మాత్ర‌మే వ్యాప్తి చేయ‌డానికి సోష‌ల్ మీడియాను వాడ కూడ‌దంటూ శ‌శిథ‌రూర్ త‌న ట్వీట్‌లో విమ‌ర్శించారు. మోదీ చేసిన ట్వీట్‌పై రాహుల్ గాంధీ కూడా స్పందించారు. విద్వేషాన్ని వ‌దిలేయండి.. సోష‌ల్ మీడియా అకౌంట్ల‌ను కాదు అని రాహుల్ ట్వీట్ చేశారు.

 

 


logo