బుధవారం 03 జూన్ 2020
National - May 08, 2020 , 07:40:10

మార్కెట్ లో ర‌ద్దీ..సామాజిక‌ దూరం రూల్స్ ఉల్లంఘన‌

మార్కెట్ లో ర‌ద్దీ..సామాజిక‌ దూరం రూల్స్ ఉల్లంఘన‌

నోయిడా: లాక్ డౌన్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో క‌రోనా కేసుల‌ను బ‌ట్టి దేశ‌వ్యాప్తంగా కేంద్రం గ్రీన్ జోన్ల‌లో కొన్ని స‌డ‌లింపులు ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే బ‌య‌ట‌కు వెళ్తే త‌ప్ప‌నిస‌రిగా సామాజిక దూరం పాటించాల‌ని ఆదేశాలు జారీచేసింది. నోయిడాలోని ఓ కూర‌గాయ‌ల మార్కెట్ ద‌గ్గ‌ర జనాలు సామాజిక దూరం నిబంధ‌న‌లు అట‌కెక్కించారు. సెక్టార్ 88లోని మార్కెట్  లో కూర‌గాయలు కొనుగోలు చేసేందుకు ప్ర‌జ‌లు పెద్ద సంఖ్య‌లో గుమిగూడారు.

ఈ నేప‌థ్యంలో మార్కెట్ క‌మిటీ ఛైర్మ‌న్ సంతోష్ మాట్లాడుతూ..తోపుడు బండ్లున్న చిరు వ్యాపారుల‌కు మాత్ర‌మే మార్కెట్ లోకి వ‌చ్చేందుకు అనుమ‌తించాల‌ని నిర్ణ‌యించారు. ర‌ద్దీని నియంత్ర‌ణ‌లోకి తీసుకువ‌చ్చేందుకు నేటి నుంచి 100-150 పాసులు ఇస్తామ‌ని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లోని ప‌రిశ్ర‌మ‌ల్లో కార్మికులు ప‌నిచేస్తున్నారు. కార్మికులు, కూలీల‌కు 5000-6000 ఫేస్ మాస్కులు పంపిణీచేసిన‌ట్లు తెలిపారు. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo