బుధవారం 08 జూలై 2020
National - Jun 14, 2020 , 18:43:25

భౌతికదూరం నిబంధన ఉల్లంఘించిన మధ్యప్రదేశ్ మంత్రి

భౌతికదూరం నిబంధన ఉల్లంఘించిన మధ్యప్రదేశ్ మంత్రి

సాగర్‌ : దేశంలో కరోనా రోజుకురోజుకూ ఉద్ధృతమవుతోంది. మహమ్మారి నియంత్రణకు ప్రజల్లో అవగాహన పెంచి భౌతికదూరం పాటించేలా, మాస్కులు ధరించేలా చూసి ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులే నియమాలను పాటించడం లేదు. శనివారం మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని సాగర్‌ జిల్లాలో బీజేపీకి చెందిన రాష్ట్ర మంత్రి గోవింద్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీలో చేరికల కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. అందరూ ఒకచోట గుమిగూడినా కనీసం పట్టించుకునే వారు కరువయ్యారు. వారికి జాగ్రత్తలు చెప్పాల్సిన మంత్రి సైతం పట్టనట్లు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  logo