ఆదివారం 29 మార్చి 2020
National - Mar 23, 2020 , 13:30:16

దేశీయ విమానాలకు డీజీసీఏ మార్గదర్శకాలు

దేశీయ విమానాలకు డీజీసీఏ మార్గదర్శకాలు

న్యూఢిల్లీ : దేశీయ విమాన సర్వీసులకు సివిల్‌ ఏవియేషన్‌ రెగ్యులేటరీ డీజీసీఏ నూతన మార్గదర్శకాలను జారీచేసింది. ప్రయాణికులు మధ్యలో ఒక సీటు వదిలి కూర్చోవాల్సిందిగా సూచించింది. అదేవిధంగా విమాన సిబ్బంది ప్రయాణికులకు దూరం పాటించే సేవలు అందించాల్సిందిగా పేర్కొంది. విమానాశ్రయాల్లో చెక్‌ అవుట్‌ కేంద్రాల వద్ద, వెయిటింగ్‌ హాళ్లలో కనీసం ఒక మీటరు దూరం పాటించాల్సిందిగా తెలిపింది. ప్రయాణికులకు, సిబ్బందికి శానిటైజర్‌ సదుపాయాలను కల్పించాల్సిందిగా వెల్లడించింది. దేశీయ విమాన సర్వీసులు నడుస్తున్నప్పటికీ అంతర్జాతీయ విమాన సర్వీసులను మార్చి 31వ తేదీ వరకు రద్దు చేసిన విషయం తెలిసిందే. 


logo