శనివారం 30 మే 2020
National - May 07, 2020 , 14:17:58

రాబందులు వ‌ర్సెస్ చిరుత‌, సింహం..వీడియో

రాబందులు వ‌ర్సెస్ చిరుత‌, సింహం..వీడియో

అట‌వీ ప్రాంతం లో క్రూర‌మృగాలు త‌మ ఆక‌లి తీర్చుకోవ‌డానికి ఇత‌ర జంతువులను వేటాడి తింటుంటాయనే సంగ‌తి తెలిసిందే. ఓ చిరుత‌పులి జింకను చంపి పొద‌ల్లోకి తీసుకెళ్లింది. ఈ దృశ్యం రాబందుల కంట ప‌డింది. ఇంకేముందీ రాబందుల గుంపు క‌ట్ట‌గ‌ట్టుకుని చిరుత ఉన్న ప్ర‌దేశానికి వ‌చ్చాయి.

చిరుత ఆ జింక‌ను తినేందుకు ప్ర‌య‌త్నిస్తుంటే.. రాబందులు కూడా త‌మ‌వంతు ప్ర‌య‌త్నం చేశాయి. కొంత‌సేపు రాబందులు, చిరుత‌కు మ‌ధ్య పోటీ కొన‌సాగింది. ఇంత‌లోనే చిరుత అక్క‌డి నుంచి మాయ‌మైంది. రాబందులు జింక మృతదేహాన్ని తిందామ‌నుకునే లోపు సింహం వాటిపైకి దూసుకొచ్చి..జింక‌ను ఎత్తుకెళ్లింది.

ఎవ‌రికీ అంద‌కుండా జింక‌ను తిని క‌డుపు నింపుకుందామ‌నుకున్న చిరుత‌కు చుక్కెదురైంది. చివరికి ఆ జింక సింహానికి ఆహార‌మైంది. ఈ వీడియో ఇపుడు సోష‌ల్ మీడియా లో చ‌క్క‌ర్లు కొడుతోంది. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo