హాస్పిటల్స్‌లో తీవ్ర ఆక్సిజన్ కొరత: సంగీతా రెడ్డి
న్యూఢిల్లీ: ఆక్సిజన్ సరఫరాలో అవాంతరాలు ఉండొద్దని కచ్చితమైన ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ దవాఖాలు తీవ్ర ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్నాయని అపోలో హాస్పిటల్స్ జాయింట్ ఎండీ సంగీతా రెడ్డి అన్నారు. ఆక్సిజన్‌ను సమకూర్చుకోవడం దవాఖానలకు సవాలుగా మారిందన్నారు. ఆక్సిజన్ సరఫరాలో ఆలస్యం అయ్యే ఒక్కో నిమిషం కొన్ని ప్రాణాల ఖరీదు చేస్తుందని ట్వీట్ చేశారు.