శనివారం 05 డిసెంబర్ 2020
National - Nov 16, 2020 , 09:11:21

కేదార్‌నాథ్‌లో హిమపాతం

కేదార్‌నాథ్‌లో హిమపాతం

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ ఆలయం సహా పలుప్రాంతాల్లో హిమపాతం కురుస్తోంది. దీంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. కేదార్‌నాథ్‌ ఆలయం గౌరికుండ్‌ నుంచి 22 కిలోమీటర్ల ఎత్తులో మందాకిని నదికి సమీపంలోని గర్హ్వాల్ హిమాలయ శ్రేణిలో ఉంది. తెల్లని మంచు చెట్లు, ఇండ్లపై పరుచుకుంది. తేలికపాటి హిమపాతం మధ్య భక్తులు రుద్రప్రయాగ్ జిల్లాలోని కేదార్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించారు.


భారత వాతావరణ శాఖ అంచనా మేరకు.. ఉత్తరకాశీ, రుద్రప్రయాగ్‌, చమోలి, బాగేశ్వర్‌, పిథోరాగఢ్‌ జిల్లాలోని పలు ప్రదేశాల్లో టెహ్రీ, డెహ్రాడూన్‌, అల్మోరా జిల్లాల్లోని కొన్ని పలు ప్రదేశాల్లో తేలికపాటి వర్షాపాతం, హిమపాతం కురిసే అవకాశం ఉందని చెప్పింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని పేర్కొంది. సముద్రమట్టానికి మూడువేల మీటర్లు అంత కంటే ఎత్తున వివక్ష ప్రదేశాల్లో హిమపాతం సంభవించే అవకాశం ఉంటుందని చెప్పింది. కాగా.. సోమవారం తెల్లవారు జామున ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రులు యోగీ ఆదిత్యనాథ్‌, తివేంద్రసింగ్‌ రావత్‌ కేదార్‌నాథ్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.