సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 15:24:41

వామ్మో.. అత‌ని ప్యాంట్‌లోకి పాము దూరి 3 గంట‌ల‌పాటు చుక్క‌లు చూపించింది!

వామ్మో.. అత‌ని ప్యాంట్‌లోకి పాము దూరి 3 గంట‌ల‌పాటు చుక్క‌లు చూపించింది!

ఆ గ‌దిలో పాము ఉన్న‌ది అని చెబితేనే కొన్నిరోజులు వ‌ర‌కు అటువైపు వెళ్ల‌ని వాళ్లున్నారు. ఎదురు ప‌డితే నోట్లోంచి మాట కూడా రాదు. అలాంటి పాము మ‌నిషి వేసుకున్న ప్యాంట్‌లోకి దూరితే, అమ్మో.. ఇంకేమైనా ఉందా ఆ మాట‌కే స‌గం చ‌చ్చిపోడు. కానీ ఏం చేస్తడు ప్రాణాల‌ను అరిచేతిలో పెట్టుకొని మూడు గంట‌ల‌పాటు అలానే ఉండిపోయాడు. జమాల్‌‌పూర్ గ్రామంలో విద్యుత్తు పనుల కోసం వచ్చిన ఎనిమిది మంది కార్మికులు స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో పడుకున్నారు.

అర్ధరాత్రి 3 గంటల సమయంలో లవ్రేష్ కుమార్ (28) అనే యువకుడి ఫ్యాంటులో ఏదో పాకుతున్నట్లు అనిపించింది. దీంతో నిలబడి ఫ్యాంటును నెమ్మదిగా కిందకి విప్పి చూశాడు. అంతే.. ప్యాంట్‌లో పాము ఉంది. వెంటనే అతడు పక్కనున్న యువకులను కూడా నిద్రలేపాడు. వారిలో ఒకరు పాములను పట్టుకొనే వ్యక్తిని తీసుకొచ్చెందుకు వెళ్లాడు. మరొకరు ఊరి పెద్దకు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నైట్ కావ‌డంతో పాముల ప‌ట్టుకునే వ్య‌క్తి వ‌చ్చేస‌రికి లేట్ అయింది. ఎవ‌రి సాయం లేకుండానే పాము అత‌డిని కాటు వేయ‌కుండా అక్క‌డి నుంచి వెళ్లిపోయింది. అనంత‌రం దాన్ని అడ‌విలో వ‌దిలిపెట్టారు. 


logo